అప్పుడే సినిమాపై క్లారిటీ వచ్చింది

SMTV Desk 2019-04-23 15:19:31  Nani Jersey, event

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సినిమా తప్పకుండా సూపర్ హిట్ కొడుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పిన నాని ప్రేక్షకులు దాన్ని నిజం చేసినందుకు సంతోషంగా ఉన్నాడు. ఇక నాని జెర్సీ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభినందన సభ ఏర్పాటు చేశాడు.

సినిమాలో అర్జున్ కు బిసిసిఐ అభినందన సభ ఏర్పాటు చేసినట్టుగా నాని జెర్సీ సినిమాకు దిల్ రాజు అప్రిసియేషన్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. తెలుగు సినిమాకు దిల్ రాజు బిసిసిఐ లాంటివారని.. ఆయన ఈ ఈవెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు నాని. అంతేకాదు ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు ఉదయం 9 లోపే దిల్ రాజు దగ్గర నుండి కాల్ వస్తే ఆ సినిమా హిట్ అనుకోవచ్చు. అలానే జెర్సీ సినిమాకు ఉదయం 8:45కి దిల్ రాజు కాల్ చేశారని అప్పుడే సినిమాపై క్లారిటీ వచ్చేసిందని అన్నారు నాని. సినిమా కథ విన్నప్పుడే అద్భుతంగా అనిపించింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ అయ్యిందని అన్నారు నాని.