అమెరికాలో బెల్లంపల్లి వాసి మృతి

SMTV Desk 2019-04-23 15:17:40  america, bellampally student died in america boston beach

వాషింగ్టన్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు విడిచాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని అశోక్‌నగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ రెడ్డి అనే విద్యార్థి అమెరికాలోని బోస్టన్‌ బీచ్‌లో ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందాడు. రిచ్‌మండ్‌లో విద్యాభ్యాసం చేస్తున్న శ్రావణ్‌.. ఆదివారం ఈస్టర్‌ వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సమీపంలోని బోస్టన్ బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో అలలు ఉద్ధృతంగా రావడంతో శ్రావణ్‌ సముద్రంలోకి కొట్టుకుపోయాడు. శ్రావణ్‌ కొట్టుకుపోవడం గమనించిన స్నేహితులు వెంటనే కోస్ట్ గార్డ్ అధికారులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టిన కోస్ట్ గార్డ్ అధికారులకు సోమవారం శ్రావణ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. తరువాత బెల్లంపల్లిలోని అతడి సోదరుడికి సమాచారం అందజేశారు.