ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో ఘర్షణలు

SMTV Desk 2019-04-23 13:31:52  uttar pradesh, bjp leaders ec,

ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. మొరాదాబాద్‌లో పోలింగ్ ఆఫీసర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నాడని అతడిపై దాడికి పాల్పడ్డారు బీజేపీ కార్యకర్తలు.

పోలింగ్ అధికారి తానే ఈవీఎంల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నాడని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. కొంత మంది ఆగ్రహంతో ఆయనపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే ఎన్నికల అధికారిని చితకబాదారు బీజేపీ కార్యకర్తలు.

అయితే.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ ఎన్నికల అధికారి అంటున్నాడు. బీజేపీ కార్యకర్తలు తనపై అకారణంగా దాడి చేశారని తెలిపారు. తాను సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా పనిచేయలేదని స్పష్టం చేశారు.