టాలీవుడ్ లోకి రాములమ్మ రీఎంట్రీ!!!

SMTV Desk 2019-04-23 13:28:15  vijayashanthi, osey ramulamma, maharshi, maheshbabu, anilravipudi

హైదరాబాద్‌: టాలీవుడ్ వింటేజ్ డేస్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి విజయశాంతి. ఈమె 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో వివిధ భాషాల్లో 180 సినిమాలకు పైగా నటించి 1998లో రాజకీయాలల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2007లో హిందీలో వచ్చిన జమానత్‌ సినిమాలో ఆమె చివరి సారిగా నటించారు. అయితే మరోసారి మెకప్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. విజయశాంతి, అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో ఆమె ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం. అయితే మరోసారి విజయశాంతిని సినిమాల్లోకి తీసుకురావాలని చాలామంది కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో న్యూడైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సక్సెస్‌ అయ్యారు. మహేష్‌ బాబుతో తను రూపిందించే సినిమాలో నటించేలా విజయశాంతిని ఒప్పించారు. దీంతో మరోసారి వెండితెరపై విజయశాంతి అందర్నీ అలరించనున్నారు. పటాస్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనిల్‌ రావిపూడి సుప్రీమ్‌, రాజా దిగ్రేట్‌, ఎఫ్‌2 చిత్రాలతో వరుసగా నాలుగు విజయాలు అందుకున్నారు.