హోండా సిబిఆర్-650ఆర్ రిలీజ్

SMTV Desk 2019-04-23 13:25:46  honda, honda motorcycles, honda cbr-650r

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా తాజాగా మరో కొత్త స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా సిబిఆర్-650ఆర్ పేరుతో లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 7.70 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. ఈ మోడల్ గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాటీ గన్‌పౌడర్ బ్లాక్ వెర్షన్లలో లభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసిన్(భారత్ మినహా) ఈ స్పోరట్స్ బైక్ 649సిసి, లిక్విడ్ కూల్డ్ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ సామర్థ్యం గల ఇంజిన్ సాయంతో 1200 ఆర్‌పిఎం వద్ద 94 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 8500 ఆర్‌పిఎం వద్ద 64 న్యూటన్ మీటర్ (ఎన్‌ఎం) టార్క్ శక్తిని అందిస్తుంది. భారత్‌లో విడుదల చేసిన ఈ మోడల్స్‌లో సంస్థ కొన్ని మార్పులు చేసింది.