కెప్టెన్ అమెరికాకు ఐరన్ మ్యాన్ గిఫ్ట్

SMTV Desk 2019-04-23 13:24:57  capten america, iron man, robert downey jr, chris evans, avengers, avengers endgame

హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ అలియాస్ ఐరన్ మ్యాన్ తన మిత్రుడు క్రిస్ ఎవాన్స్(కెప్టెన్ అమెరిక) కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు. మార్వేల్ సినిమాలల్లో వీరు తప్పకుండా ఉంటారు. అయితే వీరి స్నేహానికి గుర్తుగా రాబర్ట్ డౌనీ... క్రిస్ఎవాన్స్ కు కస్టమైజ్‌డ్ 1967 చెవర్లే కామెరో కారును గిఫ్ట్‌గా అందించారు. ఈ కారు ధర దాదాపు రూ.2 కోట్లు ఉంటుంది. ఈ కారు ఇంజిన్ చాలా పవర్‌ఫుల్. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 750 హెచ్‌పీ. కారు స్టీరింగ్‌పై కెప్టెన్ అమెరికా షీల్డ్ గుర్తు ఉంటుంది. సెలబ్రెటీలు చాలా మంది సహ నటులకు ఖరీదైన బహుమతులు అందించి.. వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు. ఇప్పుడు కూడా ఐరన్ మెన్ తనకు కెప్టెన్ అమెరికాపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇకపోతే క్రిస్ ఎవాన్స్ ఇప్పటి వరకు ఇలాంటి పవర్‌ఫుల్ కారును డ్రైవ్ చేయవలేదు. కేవలం పవర్ మాత్రమే కాదు.. ఈ 1967 షెవర్లే కారు మోటార్ పవర్ హెడ్‌ల్యాంప్స్‌ కలిగి ఉంది. అలాగే ఈ కారులో 2.9 లీటర్ సూపర్ చార్జ్ ఇంజిన్, సూపర్‌మేటిక్ 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ప్రత్యేకతలున్నాయి.