మల్లి అలరించడానికి వస్తున్న యాంకర్ ఉదయభాను

SMTV Desk 2019-04-23 13:15:25  Udayabhanu,

తెలుగు బిగ్ బాస్ రెండు సీజన్లని విజయవంతంగా పూర్తి చేసుకొంది. త్వరలోనే మూడో సీజన్ మొదలు కానుంది. ఈ సీజన్ కి హోస్ట్ గా ఎవరు వ్యవహరించబోతున్నారన్నది ఇంకా తేలలేదు. మరోవైపు, బిగ్ బాస్ 3 కంటెస్ట్ లని ఎంపిక చేసే పనిలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. సీజన్ 3లో ఒకప్పటి హాట్ యాంకర్ ఉదయభాను కనిపించబోతున్నట్టు సమాచారమ్.

ఇటీవల బిగ్ బాస్ టీం హీరో వరుణ్ సందేశ్, యాంకర్ ఉదయభానులను సంప్రదించినట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ ఈ షోలో కనిపించడం కోసం ఎంత డిమాండ్ చేశాడో తెలియదు. కానీ ఉదయభాను మాత్రం రోజుకి రెండు లక్షలు డిమాండ్ చేస్తోందట.
ఆ మొత్తం ఇచ్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం అంగీకరించినట్టు తెలుస్తోంది.