చిక్కులో బీజేపీ నాయకురాలు జయప్రద

SMTV Desk 2019-04-23 13:14:44  jayaprada,

ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద ఈసీ దగ్గర చిక్కులో పడ్డారు. ఆజాంఖాన్ వ్యాఖ్యలతో తీవ్ర ఆవేదనకు గురైన జయప్రద ఆయన మీద నోరుపారేసుకున్నారు.యూపీల బీఎస్పీ-ఎస్పీ పొత్తు నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆజంఖాన్‌ను ఉద్దేశిస్తూ ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మాయావతిపై ఆజంఖాన్ ఎక్స్ రే కళ్లు వేసి ఎక్కడెక్కడ చూశారంటూ జయప్రద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈనెల 18న ఎన్నికల ప్రచారం సందర్భంగా జయప్రద చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం లేపాయి.

దీంతో ఈసీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో పక్క పాన్ దరేబా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా జయప్రదపై పరోక్ష విమర్శలు చేశాడు. తమకు అలీ, భజరంగబలీలు కావాలి కాని అనార్కలి వద్దంటూ వ్యాఖ్యానించాడు.