సెట్ కి వెళ్తే మాత్రం అతడే బాస్

SMTV Desk 2019-04-23 13:13:00  Rajamouli

ఎస్.ఎస్ రాజమౌళి ఈ స్టాంప్ కనబడితే సినిమా హిట్ అన్నట్టే.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి. అయితే దర్శకుడిగా రాజమౌళి స్టార్ క్రేజ్ దక్కించుకుంటాడని మాత్రం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఊహించలేదట. రైటర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, భజరంగి భాయ్ జాన్, మణికర్ణిక సినిమాలతో సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు.

ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి స్టార్ డైరక్టర్ అవుతాడని తాను అనుకోలేదని అన్నాడు. తన విషయంలో తండ్రిగా గర్వపడుతున్నానని అన్నారు. అయితే ఇంట్లో ఇప్పటి మోడ్రన్ తండ్రి కొడుకుల్లా తాను రాజమౌళి ఉండమని.. ఇంట్లో పాతతరంలా తనకే గౌరవం ఇన్వాలంటూ డిమాండ్ చేస్తానని.. సెట్ కి వెళ్తే మాత్రం అతడే బాస్ అన్నారు విజయేంద్ర ప్రసాద్. రచయితగా ఉన్న తనకు సహాయం చేస్తూ ఇంప్రెసివ్ నరేషన్ నేర్చుకున్నాడని.. అలా దర్శకుడయ్యాడని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. అయితే సినిమా విషయంలో రాజమౌళి చెప్పిందే ఫైనల్ అని.. అతడే డైరక్టర్ కెప్టేన్ ఆఫ్ ది షిప్ అని అన్నారు విజయేంద్ర ప్రసాద్.