ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం

SMTV Desk 2019-04-23 13:10:17  dgp,

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఇదివరకు ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావును ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటివరకు వెంకటేశ్వరరావుకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వని విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఆయనను ఏసీబీ డీజీగా నియమిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే విధుల్లో చేరాల్సిందిగా సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.