ఓటు వేసిన ప్రధాని మోదీ

SMTV Desk 2019-04-23 13:09:22  Modi, Prime Minister, Vote,

గాంధీనగర్ : అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రధాని మోదీ క్యూలైన్‌లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లో తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ప్రధాని మోదీ ఓటు వేశారు. అనంతరం పోలింగ్‌ కేంద్రం బయట మోదీ ఓటు వినియోగించుకున్నట్లు సిరా చుక్కను చూపించారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చారు.