అనుష్క బిగ్ బాస్ హోస్ట్ గా ?వైరల్ అవుతున్న కంటెస్టంట్స్ లిస్ట్

SMTV Desk 2019-04-23 13:05:33  Anushka, Bigg Boss

బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం చేస్తున్నారు స్టార్ మా నిర్వాహకులు. సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా.. సీజన్ 2 ను నాని హోస్ట్ చేశాడు. ఇక బిగ్ బాస్ 3 హోస్ట్ గా ఎవరు చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్.టి.ఆర్, నాగార్జున, చిరంజీవి, విజయ్ దేవరకొండ, వెంకటేష్, అల్లు అర్జున్ ఇలా అందరి పేర్లు హోస్ట్ గా వినపడ్డాయి కాని ఎవరు ఫైనల్ అవలేదని తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా అనుష్క బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తుందని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక మరో పక్క బిగ్ బాస్ 3 లో పాల్గొనే కంటెస్టంట్స్ లిస్ట్ కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్దస్త్ సుధీర్, రష్మిలతో పాటుగా సీనియర్ యాంకర్ ఉదయభాను, హీరో వరుణ్ సదేష్, బిత్తిరి సత్తి, గుత్తా జ్వాలా ఇలా ప్రముఖులంతా బిగ్ బాస్ కంటెస్టంట్స్ గా వస్తారట. సెకండ్ సీజన్ లో ఎవరికి తెలియని వాళ్లను సెలెక్ట్ చేశారని కామెంట్స్ వచ్చాయి. అందుకే ఈసారి కంటెస్టంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

1. సుడిగాలి సుధీర్

2. యాంకర్ రష్మి

3. టీవీ నటి హరిత

4. వరుణ్ సందేశ్

5. హేమ చంద్ర

6. యాంకర్ ఉదయభాను

7. హీరో కమల్ కామరాజు

8. రేణు దేశాయ్

9. గుత్తా జ్వాల

10. మనోజ్ నందన్

11. జబర్దస్త్ పొట్టి రమేష్

12. కొరియోగ్రాఫర్ రఘు

13. బిత్తిర సత్తి

14. కామన్‌మెన్

15. కామన్ ఉమెన్