మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా ‘అర్జున్ సురవరం’ ప్రీ-రిలీజ్

SMTV Desk 2019-04-22 19:02:25  Arjun suravaram

దర్శకుడు టీఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకని త్వరలోనే నిర్వహించబోతున్నారు. ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే అర్జున్ సురవరంకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసినట్టే.

ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. కేశవ, కిర్రాక్ పార్టీ నిఖిల్ ని నిరాశపరిచాయి. దీంతో.. నిఖిల్ ఆశలన్నీ ‘అర్జున్ సురవరం’పైనే పెట్టుకొన్నాడు. నిఖిల్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ విజయాలు అందుకొంటున్నాడు. అర్జున్ సురవం కూడా విభిన్నమైన కథని చెబుతున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మాత.