టాటా స్కై సరికొత్త స్మార్ట్ ప్లాన్స్

SMTV Desk 2019-04-22 19:01:33  dth, tata sky, tata sky new plans

న్యూఢిల్లీ: డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ టాటా స్కై ప్రాంతీయ భాషలకు సంబంధించి తాజాగా సరికొత్త స్మార్ట్ ప్లాన్లను లాంచ్ చేసింది. టాటా స్కై కొత్త స్మార్ట్ ప్యాక్స్ ధర రూ.206 నుంచి ప్రారంభమౌతోంది. హిందీ స్మార్ట్ ప్లాన్ ధర రూ.249గా, పంజాబీ స్మార్ట్ ప్లాన్ ధర రూ.249గా, గుజరాతీ స్మార్ట్ ప్లాన్ ధర రూ.249గా, బెంగాలీ స్మార్ట్ ప్లాన్ ధర రూ.220గా, ఒడిశా స్మార్ట్ ప్లాన్ ధర రూ.211గా ఉంది. ఇకపోతే తెలుగు స్మార్ట్ ప్లాన్ ధర రూ.249గా ఉంది. తమిళ్, కన్నడ, మలయాళం స్మార్ట్ ప్లాన్స్ ధర కూడా రూ.249గా ఉంది. డీఆర్‌పీ, ఎన్‌సీఎఫ్, పన్నులు కలుపుకొని ఈ ధరల్లోనే కలిసి ఉన్నాయి. మరోవైపు టాటా స్కై మిని ప్యాక్స్, యాడ్ ఆన్ ప్యాక్స్ కూడా అందిస్తోంది. తెలుగు రీజినల్ ప్యాక్ ధర రూ.216గా, తెలుగు మిని హెచ్‌డీ ప్యాక్ ధర రూ.90గా ఉంది. టాటా స్కై అలాగే రెండు కొత్త బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్స్ కూడా లాంచ్ చేసింది.