నాని స్క్రిప్ట్ రైటర్ గా మారనున్నాడు

SMTV Desk 2019-04-22 17:31:53  natural star Nani,

నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక ఈ సినిమా తర్వాత నాని విక్రం కుమార్ డైరక్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని స్క్రిప్ట్ రైటర్ గా కనిపిస్తాడట.

సినిమాలో ఆరెక్స్ 100 హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో కూడా నాని క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. నాని గ్యాంగ్ లీడర్ లో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. జెర్సీతో సంచలన విజయం అదుకున్న నాని ఈ గ్యాంగ్ లీడర్ తో ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.