ఈసీ సరిగ్గా పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : మాయావతి

SMTV Desk 2019-04-22 17:30:43  mayawati, bahujan samajwadi party, bhopal, loksabha bjp candidate, sadhwi praghnasingh thakur

లక్నో: బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి...భోపాల్‌ బిజెపి అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. ఈ విషయంపై మాయావతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ...ఆమెపై కేంద్ర ఎన్నికల సంఘం కనబర్చుతున్న ధోరణిపై విమర్శలు గుప్పించారు. భోపాల్‌ బిజెపి అభ్యర్ధి మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ తాను ధర్మయుధ్దంలో పాల్గొంటానని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు నోటీసులు మాత్రమే ఎందుకు ఇస్తుంది? ఆమె అభ్యర్ధిత్వాన్ని ఎందుకు రద్దు చేయట్లేదు? అని ప్రశ్నించారు. కాగా, మాలెగావ్‌ పేలుళ్ల కేసులో తనను చిత్రహింసలకు గురిచేసినందున ఐపిఎస్‌ అధికారి హేమంత్‌ కర్కరే సర్వనాశమైపోతాడని తాను శపించానని, తన శాపం వల్లే ఆయన మరణించారని అని కూడా అన్నారు. దీంతో ఈసి ఆమెకు నోటీసులు పంపారు. అయితే తరువాత ఆమె క్షమాపణలు కూడ చెప్పారు. ఎన్నికల సంఘం సరైన రీతిలో పనిచేయకపోతే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఈసి స్థాయి పడిపోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదే బాధ్యత అన మరో ట్వీట్‌ చేశారు.