రాహుల్ గాంధీ నామినేషన్‌ పై వీడిన ఉత్కంఠ

SMTV Desk 2019-04-22 17:27:28  rahul Gandhi,

అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్‌ తిరస్కరణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన నామినేషన్‌ చెల్లుతుందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధినేత నామినేషన్‌ ను తిరస్కరించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి ధృవ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అఫిడఫిట్‌లో పేర్కొన్న వివరాలు సైతం తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. నామినేషన్‌ తిరస్కరించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అన్ని వివరాలు సక్రమంగానే ఉన్నాయని వెల్లడించారు.