గ్రౌండ్‌లో కన్నీళ్ళు పెట్టుకున్న కుల్దీప్‌

SMTV Desk 2019-04-22 17:26:32  kuldeep yadav crying in ground, rcb vs kkr, ipl 2019, moen ali

ముంభై: మిస్టరీ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఈ ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో ఆడుతూ తన బౌలింగ్ తో ప్రత్యర్థ జట్టుకు ధారాళంగా పరుగులిస్తున్నాడు. తాజగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్‌ వేసిన నాలుగో ఓవర్‌లో మొయిన్‌ అలీ చితక్కోట్టేశాడు. మూడు సిక్సర్లు రెండు ఫోర్లతో ఏకంగా భారీగా పరుగులు రాబట్టుకున్నాడు. ఈ ఓవర్‌ ముగిసిన వెంటనే గ్రౌండ్‌లోనే కుల్దీప్‌ కన్నీళ్లు పెట్టుకోగా సహచర ఆటగాళ్లు ఓదార్చారు. మొత్తమ్మీ ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ 4 ఓవర్లు వేసి 59 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్‌ తీశాడు.