సినిమా చూశాక మాట రాలేదు

SMTV Desk 2019-04-22 17:25:37  cinema, Jersey, Vijay Devarakonda,

నాచురల్‌ స్టార్‌ నాని.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీంతో కలిసి ఆడాలని అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ విజయ్‌ దేవరకొండ కోరుకుంటున్నారు. నాని నటించిన ‘జెర్సీ’ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ విజయ్‌ మాత్రం నానికి ఓ విభిన్న మైన ప్రపోసల్‌ పెట్టారు. జెర్సీ సినిమాలో నాని పర్ఫామెన్స్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ‘జెర్సీ.. సినిమా చూశాక మాట రాలేదు. క్లాప్స్‌ కొట్టాను. లవ్‌ టు యూ నాని. గౌతమ్‌ తిన్ననూరి.. మున్ముందు మీరు చేయబోయే ప్రాజెక్ట్‌ల కోసం నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. నాని.. నువ్వు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడాలి’ అంటూ విజయ్‌ ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ‘జెర్సీ’ సినిమాలో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటించారు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ నటించారు.