జావా మోటార్‌సైకిళ్లకు ఫుల్ డిమాండ్...డెలివరీ మాత్రం కష్టం

SMTV Desk 2019-04-22 17:24:33  JAWA Motorcycle, JAWA

మార్కెట్లోకి మహీంద్రా గ్రూప్.. ఐకానిక్ జావా మోటార్‌సైకిళ్లను పునఃప్రవేశం చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బైక్స్ బుకింగ్ స్టార్ట్ చేసినప్పటికీ డెలివరీ మాత్రం అనుకున్న సమయానికి కావడం లేదు. ఈ బైక్స్ డెలివరీకి కొన్ని పట్టణాల్లో ఏకంగా 5 -9 నెలల కాలం పడుతోంది. అంటే జావా మోటార్‌సైకిల్ కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లు ఎంతో ముందుగానే బుకింగ్ చేసుకోవలసి ఉంది. కేవలం రూ.5,000 చెల్లించి బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ జావా మోటార్‌సైకిల్ సంఖ్య కన్నా నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తోంది. అందుకే బైక్స్ తయారీ నెమ్మదిగా సాగుతోంది. అలాగే బైక్స్‌కు యూత్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. కంపెనీ ఇండోర్‌లోని తయారీ ప్లాంటులో ఈ బైక్స్‌ను తయారు చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఏబీఎస్ మోడల్‌కు ఇది డైరెక్ట్ ప్రత్యర్థి. జావా మోటార్‌సైకిల్‌లో 293 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఆరు గేర్లు, టెలిస్కోపిక్ ఫోర్క్స్, ఏబీఎస్ వంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.1.55 లక్షల నుంచి ప్రారంభమౌతోంది.