వేసవి సెలవలు ఎంజాయ్ చేయడానికి విదేశ పయనం

SMTV Desk 2019-04-22 17:23:33  Summer, ys jagan,

ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాలే తెలియాలి. కానీ ఈ ఫలితాలు తెలియాలంటే.. మే 23వరకు వేచి ఉండాల్సిందే. ఈ ఎన్నికల ఫలితాల విడుదలకు ఇంకా నెల సమయం ఉండటంతో అన్ని పార్టీల నేతలు టెన్షన్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ తమ పార్టీ కీలకనేతలు, అభ్యర్థులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈసారి సీఎం తానేనని భావిస్తున్న జగన్ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమవైపే ఉందని ఆయన చాలా గట్టి నమ్మకం మీద ఉన్నారు. ఈ క్రమంలో ప్రశాంతంగా వేసవి సెలవలు ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళుతున్నారు. యూరోప్ లోని స్విట్జర్లాండ్‌ వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఈ రోజు జగన్ హైదరాబాద్‌ నుంచి స్విట్జర్లాండ్‌ బయల్దేరనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఐదురోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జగన్‌ విడిది చేయనున్నారు. తిరిగి ఈనెల 27 రాత్రి హైదరాబాద్‌ చేరుకోనున్నారు.