బీఎస్ఎన్ఎల్ నయా ఆఫర్...6నెలలు ఫ్రీ

SMTV Desk 2019-04-22 17:20:28  bsnl, bsnl customers, bsnl new plans

ముంభై: బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం మరో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ కోసం రూ.599తో రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు (6 నెలలు). అపరిమిత ఉచిత కాల్స్ ఈ ప్లాన్ ప్రత్యేకత. వాలిడిటీ పొడిగింపు ప్లాన్ కావడంతో ఇందులో ఎలాంటి డేటా, ఎస్ఎంఎస్ ఫీచర్లు ఉండవు. వాలిడిటీ, కాల్స్ కోరుకునే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. ఈ ప్లాన్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఇటీవలే సవరించిన రూ.666 ప్రిపెయిడ్ ప్లాన్‌ను కూడా ఆవిష్కరించింది. దీంతో యూజర్లు ఎక్కువ వాలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ ఇదివరకు 122 రోజులు. ఇప్పుడు ఈ వాలిడిటీ 134 రోజులకు పెరిగింది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 3.7 జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి.