జెర్సీ చాలా హార్ట్‌టచింగ్‌గా ఉంది

SMTV Desk 2019-04-22 16:00:22  jersey, natural star nani, rajamouli

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది . మొదటి షో నుంచి ఈ మూవీపై పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలోనూ సునామి లేపుతుంది . రెండు పరాజయాల తరువాత ఈ మూవీతో మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు టాలీవుడ్ హిట్ మిషన్ నాని. ఇదిలా ఉంటే ‘జెర్సీ’ని తాజాగా వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి.. నానిపై, సినిమాపై ప్రశంసలు కురిపించాడు.

‘‘జెర్సీ చాలా హార్ట్‌టచింగ్‌గా ఉంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా రాసి, తెరకెక్కించారు. వెల్‌డన్ గౌతమ్ తిన్ననూరి. ప్రతి ఒక్కరి అద్భుత ప్రదర్శనతో సినిమా చాలా బావుంది. నాని బాబు నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లవ్ యు అంతే’’ అంటూ రాజమౌళి సోషల్ మీడియాలో వెల్లడించాడు. కాగా తన ట్వీట్‌తో నానికి టాప్ హీరో హోదాను ఇచ్చేశాడు జక్కన్న. సాధారణంగా టాలీవుడ్‌లో టాప్ హీరోలను మాత్రమే బాబు అని సంభోదిస్తుండటం మనకు తెలిసిందే.