అట్ట్రాక్టింగ్ ఫీచర్స్ తో వస్తున్న రియల్‌మి 3 ప్రో

SMTV Desk 2019-04-22 15:10:38  Realme 3 Pro, Realme 3 Pro launches

చైనా దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి మరో కొత్త ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. రియల్‌మి 3 ప్రో పేరుతో వస్తున్న ఈ ఫోన్ ను కంపెనీ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లోని యూనివర్సిటీ స్టేడియంలో సోమవారం లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.13,999 వద్ద 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇక 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. రియల్‌మి 3 ప్రో స్మార్ట్‌ఫోన్స్ ఏప్రిల్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి 3 ప్రోలో 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, నాచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 16 ఎంపీ+5 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 25 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్, ఫాస్ట్ చార్జింగ్, 4,045 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.