టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం

SMTV Desk 2019-04-22 13:24:36  Chandrababu,

అమరావతి : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆయన సమావేశం కానున్నారు. పోలింగ్‌ సరళి, ఈవీఎంల పనితీరు, ఈసీ వ్యవహర శైలి నియోజకవర్గాల్లో వైసీపీ నేతల దాడులపై చర్చించనున్నారు. కౌంటింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఇప్పటికే కొన్ని జిల్లాల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి.. ఓటింగ్ సరళిపై సమీక్షించారు.