గౌతమ్‌ తిన్ననూరి లేటెస్ట్ అప్డేట్

SMTV Desk 2019-04-22 12:49:53  Gowtham Tinnuri, jersey

జెర్సీ సినిమాతో టాలీవుడ్ కి మరో ప్రతిభ గల దర్శకుడు దొరికాడు. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి జెర్సీ సినిమా తీసిన విధానానికి టాలీవుడ్ ఫిదా అయ్యింది. సినిమాని గొప్పగా చూపించాడు. గౌతమ్‌ స్టార్ దర్శకుడు అవుతాడని కితాబిస్తున్నారు. తారక్, బన్నీ సైతం గౌతమ్‌ పనితనానికి ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ తదుపరి సినిమా ఏ హీరోతో ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం గౌతమ్‌ దగ్గర చాలా కథలు ఉన్నాయట. ఆ కథలు ఏ హీరోకి సరిపోతే.. వారి దగ్గరకి వెళ్తానని అంటున్నాడు. అంతకంటే ముందు కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకొంటా. ఇన్నాళ్లు జెర్సీ సినిమాతో బిజీగా గడిపా. విశ్రాంత్రి తర్వాత తదుపరి సినిమా గురించి ఆలోచిస్తా అంటున్నాడు గౌతమ్‌. మరోవైపు, గౌతమ్‌ కోసం స్టార్ హీరోలు ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.