శ్రీలంకలో బాంబు పేలుళ్లు.. అండగా ప్రపంచదేశాలు

SMTV Desk 2019-04-22 12:48:43  Sri lanka, France, Pakistan,

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదుల మారణహోమాన్ని ప్రపంచదేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. శ్రీలంక ప్రభుత్వానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని ప్రకటించాయి. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఉగ్రఘాతుకాన్ని తీవ్రంగా ఖండిచారు. ఆధునిక సమాజంలో హింసకు తావు లేదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బుద్ధుడి బాటను అనుసరిస్తున్న శ్రీలంకలో ఇంత పెద్ద ఎత్తున మారణ హోమం సాగించడం తగదన్నారు. అటు శ్రీలంకలో జరిగిన దాడులు తమ దేశాన్ని కలిచివేశాయని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే అన్నారు. దేశం తరపున అవసరమైన సాయం చేస్తామన్నారు.

లంకలో జరిగిన దాడులను పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రవాదుల చర్యలను..వారు చేస్తున్న పనులను ఎవరూ సమర్థించరని స్పష్టంచేసింది. అటు ఫ్రాన్స్‌, జర్మనీ, రోమ్‌, యూరోపియన్ యూనియన్, జపాన్, అస్ర్టేలియా… శ్రీలంకలో పేలుళ్లను ఖండించాయి.