శ్రీలంక పేలుళ్లని ఖండిచిన సినీ ప్రముఖులు

SMTV Desk 2019-04-22 12:43:13  Sri lanka, sai dharam tej, radhika, vishal

ఈస్టర్ పండుగ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఆరు చోట్ల మానవబాంబులతో దాడి చేశారు. శ్రీలంక రాజధాని కొలంబోలో మూడు చర్చీలు, మూడు హోటల్లో దాడులకి తెగబడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 150మంది ప్రాణాలని కోల్పోయారు. మరో 400మందికిపైగా తీవ్ర గాయాలపయ్యారు. ఈ దాడులని ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. సినీ స్టార్స్ కూడా రియాక్ట్ అయ్యారు.

సాయిధరమ్ తేజ్ : శ్రీలంక బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వాళ్లకు ధైర్యం చేకూరేలా ప్రార్ధన చేస్తున్నన్నానని ‘ప్రే ఫర్ శ్రీలంక’ అనే ఇమేజ్‌ని షేర్ చేశారు.

రాధిక : శ్రీలంక దాడిలో తృటిలో తప్పించుకున్నా. ‘ఓ దేవుడా.. కొలంబోలోని సిన్నామన్‌ హోటల్‌ నుంచి బయటికి వచ్చిన కొద్దిసేపటికే పేలుడు జరిగింది.. నమ్మలేకపోతున్నాను.. షాకింగ్‌గా ఉంది’

విశాల్ : శ్రీలంక బాంబ్ బ్లాస్ట్‌ని ఖండిస్తున్నా.. బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా