కోల్‌కతాపై హైదరాబాద్ ఘన విజయం

SMTV Desk 2019-04-22 12:41:54  ipl 2019, srh vs kkr

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతాపై హైదరాబాద్ ఇంకా 5 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా ఇక తొలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన కోల్‌కతా జట్టులో ఓపెనర్ క్రిస్‌లిన్ (51: 47 బంతుల్లో 4x4, 1x6) అర్ధశతకం సాధించినా.. జట్టుకి మెరుగైన స్కోరు అందించలేకపోయాడు. సునీల్ నరైన్ (25: 8 బంతుల్లో 3x4, 2x6) ఆరంభంలోనే వరుస బౌండరీలతో కోల్‌కతాకి మెరుపు ఆరంభమివ్వగా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే అతడ్ని ఖలీల్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేసి ఆ జట్టుని దెబ్బతీశాడు. అనంతరం వచ్చిన శుభమన్ గిల్ (3), నితీశ్ రాణా (11), దినేశ్ కార్తీక్ (6) తేలిపోవడంతో కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. మిడిల్ ఓవర్లలో రింకూ సింగ్ (30: 25 బంతుల్లో 1x4, 2x6)తో కలిసి క్రిస్‌లిన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన ఆండ్రీ రసెల్ (15: 9 బంతుల్లో 2x6) భువీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో మళ్లీ కోల్‌కతా శిబిరంలో ఉత్సాహం కనిపించినా.. వేగంగా పుంజుకున్న భువీ తెలివైన బంతితో రసెల్‌ని బోల్తాకొట్టించేశాడు. చివరి ఓవర్‌లో కరియప్ప (9 నాటౌట్: 3 బంతుల్లో 1x6) ఒక సిక్స్ బాదడంతో కోల్‌కతా 159 పరుగులైనా చేయగలిగింది.ఇక లక్ష్య చేధనలో క్రీజులోకేల్లిన హైదరాబాద్ ఓపెనర్లు శుభారంభమిచ్చారు. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (80 నాటౌట్:43 బంతుల్లో), డేవిడ్ వార్నర్(67 నాటౌట్: 38 బంతుల్లో) ఒంటరి పోరాటం చేశారు.