పట్టాలెక్కనున్న మహేష్ కొత్త సినిమా!!!

SMTV Desk 2019-04-22 12:40:04  mahesh babu, anil ravipudi, f2, maharshi, vamshi paidipalli, dilraju

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న కొత్త సినిమా మహర్షి . ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి చేసుకొని మే 9న విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకొని మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా బేసిక్ లైన్ బాగా నచ్చడంతో దానికి తగ్గట్టే ఫుల్‌స్క్రిప్ట్‌ను అనిల్ రావిపూడి సిద్ధం చేస్తారన్న గ్యారెంటీ దిల్‌రాజు ఇవ్వడంతో మహేష్ ఈ సినిమాకు ఓకే చెప్పారని తెలిసింది. ఇదిలాఉండగా అనిల్ రావిపూడి ఇప్పటిదాకా తీసిన నాలుగు సినిమాల్లో మహేష్ రేంజ్ స్టార్ హీరోను డీల్ చేయలేదు. సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తున్నందున ఈ దర్శకుడు స్క్రిప్ట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇక మహేష్ సినిమాలో చాలా కమర్షియల్ లెక్కలు ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక దర్శకుడిగా అనిల్ రావిపూడికి పూర్తి స్వేచ్ఛ ఉంది. అతను ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తేనే మహేష్ 26వ సినిమా అంచనాలను అందుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించే ఈ మూవీ షూటింగ్ జూన్‌లో మొదలయ్యే అవకాశాలున్నాయి.