యువీని అవమానించారు!

SMTV Desk 2019-04-22 12:37:05  gautam gambhir, yuvaraj singh, ipl 2019, mumbai indians

న్యూఢిల్లీ: 2019 సీజన్ ఆటగాళ్ళ వేలంలో సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ ను ఏ టీం తీసుకోవడానికి ముందుకు రాలేదు. అయితే ఈ సంఘటనపై తాజాగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌ ఆటగాళ్ళ వేలంలో యువరాజ్‌సింగ్‌ను అవమానించారని అన్నారు. ముంబై ఇండియన్స్ యువీని తీసుకోకుంటే మరింత అవమానం జరిగేదని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టుపై గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 2011 కంటే బౌలింగ్ లైనప్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. అయితే రాయుడుని ప్రధాన ఆటగాడిగా తీసుకోకపోవడం సరికాదన్నాడు.