మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ గుగు ఆర్-ఎస్‌యూవీ

SMTV Desk 2019-04-21 18:43:04  Gugu Energy reveals the Gugu R-SUV, electric two-wheeler, Gugu R-SUV

దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన వాటిలో ఎలక్ట్రిక్ బైక్ గుగు ఎనర్జీ ఒకటి. ఈ కంపెనీ ఇప్పటికే తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను గుగు ఆర్-ఎస్‌యూవీని మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ బైక్ రెండు వేరియంట్ల రూపంలో మార్కెట్‌లోకి రానుంది. ఒకటేమో స్టాండర్డ్ రేంజ్ వేరియంట్, మరొకటేమో లాంగ్ రేంజ్ వేరియంట్. తొలి వేరియంట్ ధర రూ.1.25 లక్షలుగా, లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ.3 లక్షలుగా ఉండొచ్చు అని సమాచారం. అడ్వెంచర్ బైక్ స్టైల్‌తో ఉన్న మోటార్‌సైకిల్‌లో లార్జ్ విండ్‌స్క్రీన్ తో పాటు 5 అంగుళాల టచ్‌స్క్రీన్ కన్సోల్ ఉంటుంది. నావిగేషన్, రియల్‌టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, బ్యాటరీ ఇండికేటర్స్ వంటి సేవలు పొందొచ్చు. ట్రిప్ మీటర్, స్పీడ్ మీటర్ వంటి వాటికి ఈ సేవలు అదనం. కస్టమర్లు అలాగే వారి ఫోన్లలో గుగు ఎనర్జీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దీని సాయంతో దగ్గరిలోని చార్జింగ్ లొకేషన్ల వివరాలు పొందొచ్చు. టూవీలర్ బ్యాటరీ కేవలం 45 నిమిషాల్లో ఫుల్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 160 కిలోమీటర్లకుపైగా ప్రయాణించొచ్చని పేర్కొంది. ఈ టూవీలర్ కేవలం 6 సెకన్లలోనే 0-97 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు. అయితే ఈ బైక్స్ ఈ ఏడాది చివరకు మార్కెట్‌లోకి రావొచ్చు. ప్రి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టూవీలర్‌ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 28 లీటర్లు.