వ్యాయామంతో పాటు ఎక్కువ ఆహారం

SMTV Desk 2017-06-02 17:56:58  cranchese, coletral, music health tips, streching, warm up,daization

హైదరాబాద్, జూన్ 2 : వ్యాయామాల వల్ల శరీర సౌందర్యం ముఖంపై కాంతి అన్ని రకాలుగా ఆరోగ్యం చేకూరుతుంది. క్రంచెస్ వ్యాయామాలు చేసినా కడుపునిండా తినలే తప్ప పొట్ట మర్చుకోకుడదు. వ్యాయామం చేసినప్పుడల్లా మన శరీరంలో కొవ్వు కరిగి కండరాల శాతం పెరుగుతుంది. దీని వలన మనం తిన్నదంతా చక్కగా జీర్ణమై శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేసినప్పుడు ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి. సంగీతం వింటూ వ్యాయామం చేసేవారికి ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే సంగీతం వింటూ చేసే వ్యాయామంలో విసుగు రాకుండా సమయ స్పూర్తితో పెద్దగా కష్టం లేకుండా ఉంటుంది. కనుక సంగీతం వింటూ వ్యాయామం చేసే వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. ముందు స్ట్రెచింగ్ లు చేసి తరువాత వ్యాయామం చేయాలని చాల వరకు అనుకుంటారు. నిజమే కానీ స్ట్రెచింగ్ అనేది ఎలా పడితే అలా చేయకూడదు. దీని ద్వారా కండరాలు పట్టేస్తుంటాయి. వార్మ్ అప్, స్ట్రెచింగ్ రెండు వేర్వేరు వ్యాయామాలు ఒక దానితో మరొక వ్యాయామానికి సంబంధం ఉండదు. వార్మ్ అప్ లని నిపుణుల ఆధ్వర్యంలో నేర్చుకొని అప్పుడు సొంతంగా చేయండి.