నవజ్యోత్‌సింగ్‌ సిద్ధుకి ఈసీ నోటీసులు జారీ

SMTV Desk 2019-04-21 18:04:19  navjothsingh sidhu, loksabha elections, congress, punjab minister, election commission

పాట్నా: కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధుకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. బీహార్‌లోని కతిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో.. ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆయనకు నోటీసులు జారీచేసింది. 24 గంటల్లోగా తాను చేసని వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.