స్వదేశానికి జానీ బెయిర్‌స్టో

SMTV Desk 2019-04-21 18:02:28  sunrisers Hyderabad, ipl 2019, Jonny Bairstow

హైదరాబాద్: ఈ నెల 23న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక బ్యాట్స్ మెన్ జానీ బెయిర్‌స్టో జట్టును వీడి స్వదేశానికి బయల్దేరనున్నాడు. ఐర్లాండ్, పాకిస్థాన్ జట్లతో సిరీసులు.. మే 30 నుండి ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ జట్టు శిక్షణ శిబిరం ప్రారంభం కానుండడంతో బెయిర్‌ స్టో స్వదేశానికి బయలుదేరనున్నాడు. ఆదివారం కోల్‌కతాతో, మంగళవారం చెన్నైతో జరిగే మ్యాచ్‌లకు మాత్రమే బెయిర్‌ స్టో సన్‌రైజర్స్‌కు ఆడతాడు. ఈ సీజన్-12లో సన్‌రైజర్స్‌ జట్టు ఆడిన 8 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేసులో ఉంది. సన్‌రైజర్స్‌కు ఓపెనర్లే పెద్ద బలం. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలే పరుగులు చేశారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లలో జానీ బెయిర్‌స్టో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే.