లాభాలతో ముందుకెళ్తున్న హెచ్‌డీఎఫ్‌సీ

SMTV Desk 2019-04-21 15:41:48  hdfc bank, hdfc, rbi, hdfc debts interests , hdfc march income

ముంభై: ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా మార్చి త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22.6 శాతం నికర లాభాల్లో వృద్ధి కనిపించింది. ఈ సీజన్లో రూ.5,805 కోట్ల లాభాన్ని విశ్లేషకులు అంచనా వేయగా అది రూ.5,885 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఇదే సమయంలో రూ.4,799 కోట్ల లాభాన్ని ప్రకటించింది.