వీర్ చక్ర అవార్డుకు నామినేట్ అయిన అభినందన్‌

SMTV Desk 2019-04-21 15:37:45  Abhinandan,

వింగ్ కమాండర్ అభినందన్ ను వీర్ చక్ర అవార్డుకు ప్రతిపాదించింది ఆర్మీ. శత్రువును మట్టుబెట్టే మిరాజ్ 2000 యుద్ధ విమాన పైలట్ అభినందన్ గత ఫిబ్రవరి 27 న పాక్ చెందిన ఎఫ్ 16 యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. పాకిస్థాన్ సైనికులకు పట్టుబడినా..దేశ రక్షణ రహాస్యాలు బట్టబయలు చేయకుండా ధైర్యంగా నిలబడ్డాడు. కాగా వీర్ చక్ర అవార్డు యుద్ధంలో ధైర్యసాహాసాలు ప్రదర్శించిన వారికి అందించే మూడో అత్యున్నత శౌర్య పతకం కావడం విశేషం.