పురుగుల విసర్జాలతో చేసే 'టీ' బంగారంతో సమానం!

SMTV Desk 2019-04-21 15:34:31  Bug Poop tea

బీజింగ్: చైనా, తైవాన్ దేశాల్లో దొరికే ఓ రకమైన టీ ధర ఏకంగా రూ.200 వరకు పలుకుతోందట. అంతేకాక ఈ ఛాయ్ తయారయ్యేది పురుగుల విసర్జితాలతో. కొన్ని రకాల పురుగులు తేయాకులను తిన్న తర్వాత విసర్జించే మలాన్ని సేకరించి, ఎండబెట్టి పొడి చేసి ప్యాక్ చేస్తారట. ఈ పొడితో చేసిన ఒక కప్పు టీ ధర రూ.200 వరకు ఉంటుంది. అయితే, ఈ అరుదైన టీ తాగడం వల్ల ఆరోగ్యపరమైన ఉపయోగాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రక్తపోటు, జీర్ణకోశ సమస్యలు ఉన్నవాళ్లకు ఎంతో ఉపశమనం లభిస్తుందట. సేంద్రీయ తేయాకులను తినే పురుగుల విసర్జితాలతో మాత్రమే తయారు చేసే ఈ స్పెషల్ టీ ప్యాకెట్లను ఇప్పుడు చైనా, తైవాన్ దేశాల్లో కానుకలుగా అందిస్తున్నారట. ఈ దేశాల్లో ఇంకో రకమైన టీ కూడా చాలా ఫేమస్. అదే పాండాల పేడతో తయారు చేసే ఛాయ్. పాండాలు ఎక్కువగా వెదురు మొక్కలను తింటాయి. దాంతో అవి విసర్జించే పేడలో అత్యధిక పోషకాలు, క్యాన్సర్ నిరోధకాలు సైతం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతే అప్పటి నుంచి పాండాల విసర్జనతో గ్రీన్ టీలను తయారు చేస్తున్నారట. అయితే ఇది ఇంకా వ్యయం కాస్తా ఎక్కువనే. ఒక టీ ప్యాకెట్ ధర రూ.2.4 లక్షలు పలుకుతుందట.