పిడుగు పాటుకు ఐదుగురు మృతి

SMTV Desk 2019-04-21 12:55:32  Guntur, Thunderstrom,

ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఒకే రోజు పిడుగులు పడ్డాయి. ఈ పిడుగు పాటుకు ఐదుగురు మృతి చెందారు.

వివరాలలోకి వెళ్తే... వినుకొండ మండలం ఉప్పరపాలెంలో పిడుగు పడి గుమ్మా చిన్నయ్య, ఈపూరు మండలం అగ్నిగుండాల్లో పిడుగు పడి వెంకటేశ్వర్ రెడ్డి, నూజెండ్ల మండలం దాసుపాలెంలో పిడుగు పడి వెంకట కోటయ్య, కారంపూడి పంట పొలాల్లో పిడుగు పడి మిరప కోతకు వెళ్ళిన షేక్ మస్తాన్, నూజెండ్ల మండలం పమిడిపాడులో పిడుగు పడి కెనాల్‌ దగ్గర పనికి వెళ్లిన కూలీ మృతి చెందారు.