నంద్యాలలో వైసీపీ నేత ఇంట్లో రూ. 40 లక్షలు

SMTV Desk 2017-08-19 11:27:13  YSRCP, Nandyala by-polls, Police, YS Jagan, Silpa Mohan Reddy

నంద్యాల, ఆగస్ట్ 19: నంద్యాల ఉపఎన్నికల ప్రచారం చాలా వాడి-వేడిగా సాగుతుంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ పోటి సాగుతుంది. అయితే ఇప్పటికే నంద్యాలలో డబ్బు, మద్యం ఏరులై పారుతుందని పలువురు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నేటి ఉదయం స్థానిక బనగానపల్లె మండలం పలకలూరు గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత ఇంటిలో సోదాలు నిర్వహించిన పోలీసులు సుమారు 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు ఇచ్చేందుకే ఇంత భారీ మొత్తంలో డబ్బు ఇంట్లో ఉంచారనే అనుమానంతో పోలీసులు స్వాధీన పరచుకున్నారు.