వెండి పైకి...పసిడి కిందికి

SMTV Desk 2019-04-21 12:46:17  Gold Rate, Silver rate, Bullion market

జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర క్షీణించింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.20 తగ్గుదలతో రూ.32,670వద్ద ఉంది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.100 పెరుగుదలతో రూ.38,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర గురువారం ఔన్స్‌కు 0.09 శాతం తగ్గుదలతో 1,277.90 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు స్థిరంగా 14.96 డాలర్ల వద్ద ఉంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌కు సెలవు. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.20 తగ్గుదలతో రూ.32,670కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30 తగ్గుదలతో రూ.32,500కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా ఉంది. కేజీ వెండి రూ.100 పెరుగుదలతో రూ.38,600కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర స్థిరంగా రూ.37,230కు కొనసాగింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది.