టిక్‌టాక్ లో కేసీఆర్ వీడియోలు

SMTV Desk 2019-04-21 12:14:45  tik tok, kcr, kcr videos in tik tok, cyber crime, hyderabad, telangana cm

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై టిక్‌టాక్ వీడియోలను ఎడిట్ చేసి ఉంచిన వైనంపై టిఆర్‌ఎస్ నాయకులు సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు ఆరు వెబ్‌సైట్లపై కేసు నమోదుచేశారు. ఇతర వెబ్‌సైట్లపై విచారణ చేపడుతున్నారు. కెసిఆర్ ఎన్నికల సమయంలో బహిరంగ సభలలో మాట్లాడిన వ్యాఖ్యల ను టిక్‌టాక్ అనుకరిస్తూ వీడియోలను ఉంచారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోలలో ఉన్న యువకులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగారు. కాగా యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలపైనా సైబర్ క్రైం పోలీసులు దృష్టిసారిస్తున్నారు.