మీరే దొంగ ఓట్లు వేయండి...!!!

SMTV Desk 2019-04-21 12:10:26  congress party, bjp, loksabha elections, election commission of india, uttarpradesh minister swamy prasad mourya, badoun constituency, sanghamitra mourya

లక్నో: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు పార్టీ నేతలు నిర్వహిస్తున్న ప్రచారాలు వివదాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ-కాంగ్రెస్ అభ్యర్థులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందున్నారు. ఇప్పటికే కొందరికి ఈసీ చివాట్లు పెట్టి నోటీసులు ఇస్తున్నా నేతల తీరు మాత్రం మానడం లేదు. తాజాగా యూపీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య కూతురు, బదౌన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంఘమిత్ర మౌర్య కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. ఓటర్లు రాకపోతే మీరే దొంగ ఓట్లు వేసేయాలని కార్యకర్తలకు సూచించారు. అయితే ఆ పని కాస్త రహస్యంగా చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సంఘమిత్రపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు విపక్ష నేతలు.