'జెర్సీ' సక్సెస్ మీట్

SMTV Desk 2019-04-21 11:59:26  Jersey , nani

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని-శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి.. మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్రబృందం సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “ఈ కథను నానిని దృష్టిలో పెట్టుకుని రాయలేదు. నేను రాసుకున్న స్క్రిప్ట్‌ పూర్తయ్యాకే అది ఎవరికి సరిపోతుందనేది ఆలోచించుకుంటా. ఈ కథ రాసుకున్నాక రెండు మూడేళ్ల వరకు నా దగ్గరే ఉంది. ఎవరికీ చూపించలేదు. ఈ కథని నాని అయితే సరిగ్గా సరిపోతాడని అనిపించింది. ఆయన కథ వినగానే ఓకే చేశారు” అని చెప్పుకొచ్చారు.