వెబ్ సిరీస్ తో సందడి చేయనున్న "రానా"

SMTV Desk 2017-08-18 18:59:33  daggubati rana, web series, social media, viu app

హైదరాబాద్, ఆగస్ట్ 18 : ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల హవా అంతా ఇంతా లేదు. పెద్ద హీరోలు సైత౦ బుల్లి తెర బాట పడుతున్నారు. రోజు రోజుకి సిరీస్ ల హవా పెరిగిపోతూనే ఉంది. ఇదే బాటలో ప్రముఖ హీరో దగ్గుబాటి రానా కూడా చేరినట్లుగా తెలుస్తోంది. రానా ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ లో మరో నటుడు న‌వీన్ క‌స్తూరియా కూడా కనిపించబోతున్నారు. "వియూ" సంస్థ వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. దీనికి "సోష‌ల్" అనే పేరును ఖరారు చేసారు. రానా ఇప్పటికే "నెం. 1 యారి" అంటూ బుల్లితెర మీద సందడి చేస్తున్న విషయం తెలిసిందే. విపరీతంగా సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్దేశించి ఈ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్ మొదటి వారం "వియూ వెబ్ ఛాన‌ల్‌" లో మొదటి ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నారు.