లెమన్ టీ తో డ‌యాబెటిస్ కు చెక్

SMTV Desk 2019-04-20 18:13:43  lemon tea, diabeties,

మ‌న దేశంతోపాటు ప‌లు ఆసియా దేశాల్లోనూ లెమ‌న్ గ్రాస్ మొక్క బాగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల్లో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయి. లెమ‌న్‌గ్రాస్ ఆకుల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్‌ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఈ ఆకులు ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. అయితే లెమన్‌గ్రాస్ ఆకుల నుంచి త‌యారుచేసే “టీ”ని రోజు తాగ‌డం వల్ల కూడా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ఈ టీ తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంతో పాటు.. త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, క‌డుపు నొప్పి త‌గ్గుతాయి. అంతేకాదు ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగు ప‌డుతుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఇంకా కిడ్నీ స‌మ‌స్య‌లు తొలగిపోయి.. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గడమే కాకుండా.. డ‌యాబెటిస్ కంట్రోల్ అవుతుంది.