“టైగర్ కెసిఆర్” లో జబర్దస్త్ ఫేమ్

SMTV Desk 2019-04-20 18:10:02  Jabardasth, mahesh

గత కొంత కాలంగా విజయాలు లేక తల్లడిల్లినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తనేంటో మళ్ళీ నిరూపించుకున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందునుండే ఎన్నో సంచలనాలను సృష్టించింది. అంతే విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు వర్మ గారి ద్రుష్టి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పైన పడింది. కెసిఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించినందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు కూడా. ఆ చిత్రానికి “టైగర్ కెసిఆర్” అని పేరు పెట్టి, దానికి తగ్గట్టుగానే పోస్టర్ కూడా విడుదల చేశాడు వర్మ. అంతేకాకుండా ఈ సినిమాకి అగ్రెస్సివ్ గాంధీ అనే కాప్షన్ కూడా పెట్టాడు. దానితో పాటు “ఆడు తెలంగాణ తెస్తానంటే అందరు నవ్విండ్రు” అనే ఉప శీర్షికను జోడించాడు.

కాగా ఈ సినిమాలో కెసిఆర్ పాత్రని పోషించడానికి ప్రముఖ టీవీ షో జబర్దస్త్ లో నటించే మహేష్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా మహేష్ ఇప్పటికే రంగస్థలం, మహానటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వర్మ ఇటీవల తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్ర పోషించాడనికి ఒక రంగస్థల నటుడిని తీసుకోగా, టైగర్ కెసిఆర్ చిత్రంలో నటించేందుకు మరొకరిని తీసుకున్న పెద్దగా ఆలోచించాల్సింది ఏమి లేదు. కానీ కెసిఆర్ పాత్రలో నిజంగానే జబర్దస్త్ మహేష్ నటిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.