శ్రీలంక వెళ్లిన కాజల్..

SMTV Desk 2019-04-20 18:07:40  Kajal agarwal,

సహజంగా హీరోయిన్లు ఓ టాక్ రాగానే... చక్కా వ్యాపారాలు మొదలెట్టేయడం చాలా సహజమైన అంశంగా మారిపోయింది. అదేంటో గానీ.. ఇది వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారంతా పలు రకాలుగా బిజినెస్ మోజులో పడ్డవారే. అంతేకాకుండా రకరకాల కాస్మోటిక్స్ ప్రచారం చేస్తూ... భారీ రెమ్యునరేషన్ తీసేసుకుంటుంటారు.

కాజల్ అగర్వాల్ పక్కా బిజినెస్ నటి. దేనికదే అనే తత్వం కలిగిన స్టార్ హీరోయిన్. అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకొని సినిమా చేస్తుంటుంది కూడా. సినిమా మాత్రం ఎంతమాత్రం మిస్ చేసుకోవడం ఇష్టముండదు. రెమ్యునరేషన్ వదులుకోదు. రీసెంట్ గా ఈ అమ్మడు శ్రీలంక వెళ్ళింది. అక్కడ క్యాసినోవాలో సందడి చేసింది. క్యాసినోవాకు వచ్చే కస్టమర్స్ తో సరదాగా మాట్లాడినందుకు నిర్వాహకులు భారీగా డబ్బు ముట్టజెప్పారని టార్ నడుస్తోంది. మొత్తానికి మన హీరోయిన్ లు మాట్లాడిన.. ఎవరితోనైనా కాసేపు గడిపినా తగు మొత్తం ముట్ట చెప్పుకోవాల్సిందేనా.. ఇంత ఖరీదైన.. విలువైన నటీమణులన్నమాట.