కేటాయింపుల తర్వాతే ఏపీ ఎంప్లాయీస్ రిలీవ్..!

SMTV Desk 2017-08-18 18:39:02  AP employees, final divisions, telangana public sector employees

హైదరాబాద్, ఆగస్ట్18 : రాష్ట్ర విభజన నేపథ్యంలో తుది కేటాయింపులు జరిగేంత వరకు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలనుకున్న అధికారులను రిలీవ్ చేయొద్దని తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ (టీఎస్బీసీఎల్) చైర్మన్ దేవీ ప్రసాదరావు ఆ సంస్థ ఎండీని ఆదేశించారు. ఉద్యోగుల విభజన పూర్తి కాకముందే వారిని ఎలా రిలీవ్ చేస్తారంటూ కొందరు అధికారులు ప్రశ్నిస్తూ, 14 మ౦ది దరఖాస్తు చేసుకోగా ఆరుగురికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చారంటూ నిలదీశారు. దీంతో చైర్మన్ ఆ ఆర్డర్లను రద్దు చేయమని సంస్థ ఇంచార్జ్ ఎండీ ఆర్వీ చంద్రవదన్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ విజయ్ మోహన్, అధ్యక్షుడు సుధీర్ బాబు, ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధా రత్నాకర్, కార్యదర్శి సీఆర్ కృష్ణ దేవినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.