చంద్రబాబు ని పక్కన పెట్టిన మమతా బనెర్జీ

SMTV Desk 2019-04-20 15:35:44  Chandrababu, mamata benerjee

ఏపీలో ఎన్నికలు ముగిసి ఇంకా ఫలితాలు కూడా రాలేదు. అప్పుడే టీడీపీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అంతేకాకుండా ఎన్నికలలో అన్నీ సర్వేలు చంద్రబాబు ఓటమినే తెలుపుతున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో అత్యంత సన్నిహితంగా ఉంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చంద్రబాబుకు దూరమవుతున్నారు అని రాజకీయ వర్గాలలో ఇప్పుడు చర్చగా మారింది. అంతేకాదు మమతకు వైఎసార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రహస్య మంతనాలు కొనసాగుతున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల మమతా బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్రంలో నాన్ ఎన్డీఎ, నాన్ యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ నేతలంతా చర్చలు జరిపి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారని, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఫలితాలే కీలకం కానున్నట్లు ఆమె చెప్పారు. అయితే ఏపీ ఎన్నికలలో చంద్రబాబుకి మద్ధతుగా నిలిచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె విశాఖపట్నంలో ప్రచారం కూడా చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఓటమిని పసిగట్టిన ఆమె ముందుగానే జగన్‌తో మంతనాలు కొనసాగిస్తున్నారు. దీనికి కారణం గత కొన్ని రోజులుగా చంద్రబాబులో ఓటమి భయంతో ఈసీనీ, వీవీ ప్యాట్ల లెక్కింపులపై చాల విమర్శలు చేస్తుండడంతో ఓటమిని అంగకరించలేకే ఇలా చేస్తున్నారని అందరికి అర్ధమైపోయింది. అందుకే అవసరమైతే చంద్రబాబుకు దూరం అయ్యేందుకు మమత సిద్ధంగా ఉందని సమాచారం. అందుకే పూర్తిగా కాకుండా చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూనే జగన్‌ను కూడా తెలివిగా తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మమతా బెనర్జీ.